![]() |
![]() |
.webp)
ఆట సందీప్ అండ్ జ్యోతి గురించి బుల్లితెర మీద అందరికీ తెలుసు. ఐతే ఆట సందీప్ బర్త్ డే సందర్భంగా జ్యోతి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది.. ఇంతకు ఆ సర్ప్రైజ్ ఏంటి అనే విషయాన్ని సందీప్ ని గెస్ చేయమని చెప్పింది. కానీ సందీప్ మాత్రం సర్ప్రైజ్ ని ఎలా గెస్ చేస్తారంటూ ఆలోచించాడు కానీ చెప్పలేకపోయాడు. "ప్రతీ ఏడాది ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుంది కానీ ఈ ఏడాది మాత్రం ఆ సర్ప్రైజ్ వేరు..నా ఐడియాలజీ తెలుసు కదా నేనంటే కంప్లీట్ గా మా పేరెంట్స్ కన్నా ఎక్కువగా నీకే తెలుసు కదా..సరే కళ్ళు మూసుకో" అని చెప్పి "నేను నిన్ను ఏమని పిలుస్తా" అని అడిగింది. "సనమ్" అని పిలుస్తా అని సందీప్ చెప్పాడు. దాంతో తన చేతి మీద ఉన్న ఒకదాన్ని కెమెరాకు చూపించింది.
.webp)
తర్వాత సందీప్ కళ్ళు తెరిచి చూపించింది. తన చేతి మీద సనమ్ అని ఒక రెడ్ హార్ట్ సింబల్ ని చూపించింది. అదే ఈ ఏడాది బర్త్ డే సర్ప్రైజ్ అని చెప్పింది. దాంతో ఆట సందీప్ ఫుల్ షాక్ అయ్యాడు. ఇది హ్యాపీ న్యూస్ ఐతే ఇంకో శ్యాడ్ న్యూస్ ఉంది అంటూ ఈ టాటూ వేయించుకుంటే మళ్ళీ వచ్చే జన్మలో కూడా కలిసే పుడతామంటా అని చెప్పింది జ్యోతి. ఆ మాటకు సందీప్ అబ్బా మళ్ళీ నువ్వేనా అన్నట్టుగా షిట్ అనే డైలాగ్ వేసాడు. టాటూ వేయించుకోవడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే టాటూ వేయించుకుంటామో చనిపోయేటప్పుడు కూడా ఈ టాటూ వెంటే వచ్చేస్తుంది అని చెప్తూ సందీప్ ని హగ్ చేసుకుంది. ఈ వీడియో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నారు. సందీప్ మాస్టర్ అలియాస్ ఆట సందీప్ గురించి అందరికీ తెలిసిందే. డాన్స్ రియాలిటీ షో ఆటతో సందీప్ బాగా పాపులర్ అయ్యాడు. ఆ షో పేరే తన ఇంటికి పేరుగా మారిపోయింది. ఆట సందీప్ బిగ్ బాస్ తెలుగు 7 తో మరోసారి వెలుగులోకి వచ్చాడు. సందీప్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు.
![]() |
![]() |